ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పద్మావతీ పరిణయోత్సవాలు - గరుడవాహనంపై స్వామిఅమ్మవార్ల ఊరేగింపు - PADMAVATHI MAHOTSAVAM - PADMAVATHI MAHOTSAVAM

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 20, 2024, 12:23 PM IST

Padmavathi Srinivasa Parinaya Mahotsavam Has Ended Grandly: తిరుమలలో పద్మావతీ శ్రీనివాసుల పరిణయ మహోత్సవం ఆధ్వర్యంలో ఘనంగా ముగిసింది. చివరి రోజు శ్రీవారి ఆలయం నుంచి స్వామివారు గరుడవాహనంపై శ్రీదేవి, భూదేవి వేర్వేరుగా పల్లకీపై బయల్దేరి ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతీ పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. శ్రీ స్వామివారు, అమ్మవార్లకు ఎదుర్కోలు, పూల బంతులాట, నూతన వస్త్ర సమర్పణ తదితర కల్యాణ వేడుకలు జరిగాయి. ఉత్సవాలు వైభవంగా ముగిసిన తరువాత కొలువు తీరారు. 

Complete Three Days parinayotsavam Grand End: అనంతరం శ్రీవారు దేవేరులతో బంగారు తిరుచ్చిపై తిరువీధులగుండా ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేశారు. తర్వాత ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేద పారాయణం శాస్త్రోక్తంగా చేశారు. వేడుకల్లో కళాకారులు మంగళకరంగా సంగీత, మేళ, తాళ వాయిద్యాలను ప్రదర్శించారు. దీంతో మూడు రోజుల శ్రీపద్మావతి పరిణయోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈవో ధర్మారెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details