ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వ్యవసాయం, అనుబంధ రంగాల్లో అవార్డులు - రాష్ట్రం నుంచి ముగ్గురికి ప్రదానం - OUTLOOK INDIA AWARDS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 9, 2024, 10:21 PM IST

Outlook India has Given Awards to Many People (ETV Bharat)

Outlook India Awards AP People : దేశంలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో వినూత్నమైన రీతిలో ఫలితాలు సాధిస్తున్న పలువురికి ఔట్‌లుక్‌ ఇండియా అవార్డులను అందజేసింది. దిల్లీలో నిర్వహించిన ఔట్‌లుక్ అగ్రిటెక్ సమ్మిట్‌లో రాష్ట్రానికి చెందిన ముగ్గురికి కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి దేవేస్‌ చతుర్వేది అవార్డులను అందజేశారు. 'వ్యవసాయం భవిష్యత్తు, మార్పు యొక్క విత్తనాలు విత్తడం' అనే ఇతివృత్తంతో సదస్సు నిర్వహించారు. జాతీయ అత్యుత్తమ KVKగా నంద్యాల జిల్లాలోని యాగంటిపల్లి కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఎంపిక చేశారు. ఈ అవార్డును కేవీకే నిర్వాహకురాలు, సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ గూడూరి ధనలక్ష్మి అందుకున్నారు. 

అనకాపల్లి జిల్లాలోని కొందంపూడిలో KVK సహకారంతో సహజ పద్ధతుల్లో వ్యవసాయం చేసి కూరగాయలు, బంతి సహా ఇతర పంటలు పండిస్తున్న షేక్ యాకిరికి అవార్డు దక్కింది. అలాగే సహజ పద్ధతుల్లో ఉత్పత్తి చేస్తున్న తృణధాన్యాలతో బిస్కెట్స్ సహా పలు రకాలైన ఉత్పత్తులు ప్రవేశ పెడుతున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన తమ్మినేని మురళీకృష్ణకు అవార్డులు దక్కాయి. నూతన వ్యవసాయ విధానాలను రైతులకు చేరవేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి అన్నదాతల ఆదాయం పెంచడంలో చేసిన కృషికి గానూ అత్యుత్తమ KVK అవార్డును యాగంటిపల్లికి అందజేసినట్లు దేవేస్‌ చతుర్వేది తెలిపారు. ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం ఆనందంగా ఉందని సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ గూడూరి ధనలక్ష్మి చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details