ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్‌ నిర్వహించాలి- అచ్యుతాపురం బాధితులను పరామర్శించిన విపక్ష నేతలు - Opposition Leaders Visit Victims - OPPOSITION LEADERS VISIT VICTIMS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 22, 2024, 9:24 PM IST

Opposition Leaders Visited Achyutapuram Parma Company victims: అచ్యుతాపురం పార్మా కంపెనీ బాధితులను వైఎస్సార్‌సీపీ నేతలు పరామర్శించారు. విశాఖ కేజీహెచ్​కు వెళ్లి బాధిత కుటుంబాలతో మాట్లాడారు. బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పరిశ్రమల్లో ఉద్యోగుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. అన్ని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్‌ నిర్వహించాలని వైఎస్సార్​సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. అచ్యుతాపురం ఘటన దురదృష్టకరమని అన్నారు. బాధితుల్ని కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బాధితులకు భరోసా కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని కాని నష్టపరిహారంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేదని బొత్స విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎల్జీ పాలీమర్స్‌ ఘటనలో బాధితులకు కోటి రూపాయల పరిహారం ఇచ్చామని అలానే ఇప్పుడు కూడా మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని బొత్స అన్నారు. ఘటనకు బాధ్యులు అయిన యాజమాన్యం మీద చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. విశాఖను ప్రమాదరహితంగా మార్చాలని కాంగ్రెస్‌ నేత జేడీ శీలం కోరారు. 

ABOUT THE AUTHOR

...view details