పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఘనంగా ఓనం వేడుకలు - ఆకట్టుకున్న కేరళ భక్తుల డప్పు వాయిద్యాలు - Onam celebrations at Puttaparthi - ONAM CELEBRATIONS AT PUTTAPARTHI
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 14, 2024, 5:45 PM IST
Onam Celebrations were Held Grandly at Puttaparthi : ఆధ్యాత్మిక కేంద్రమైన శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఓనం వేడుకలు ఘనంగా జరిగాయి. కేరళ నుంచి వచ్చిన భక్తులు ప్రశాంతి నిలయాన్ని సర్వాంగ సుందరంగ తీర్చిదిద్దారు. పంచవాద్యం, చండమేళం డప్పు వాయిద్యాలతో కేరళ భక్తులు చేసిన సంగీత కార్యక్రమం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. కేరళ సాంప్రదాయం అనుసరించి వాయిద్యాలను వాయించారు. అనంతరం సత్యసాయి ట్రస్ట్ ఈవో రత్నాకర్ కేరళ భక్తులకు నూతన వస్త్రాలు, ప్రసాదాలను అందించారు. మంగళహారతి అనంతరం వేడుకలను ముగించారు.
ఓనం పండుగను కేరళ వాసులు తమ సంస్కృతి, సంప్రదాయాలను అనుసరించి జరుపుకుంటారు. పండుగా సందర్భంగా కేరళ ప్రజలు తమ సాంప్రదాయ దుస్తులను ధరిస్తారు. బంధుమిత్రులతో పండుగ వేడుకలను ఎంతో ఆనందంతో, ఉత్సాహంతో జరుపుకుంటారు. కేరళ వాసులు ఓనం పండుగను జీవితంలో ఆనందానికి, శ్రేయస్సుకి చిహ్నంగా భావిస్తారు. ఈ పండుగ ఉత్సవాలు 10 రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 6 న మొదలైన ఓనం వేడుకలు 10 రోజుల పాటు సంప్రదాయంగా జరిగి సెప్టెంబర్ 15న జరిగే తిరుఓనంతో ముగుస్తాయి.