ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తగ్గిన మునేరు వరద - హైదరాబాద్-విజయవాడ హైవేలో వాహనాలు పునరుద్ధరణ - Police Allowed To Vehicles - POLICE ALLOWED TO VEHICLES

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 2, 2024, 8:43 PM IST

Police Allowed Vehicles to Pass at Ithavaram : ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద మునేరుకు క్రమంగా వరద తగ్గుముఖం పడుతోంది.  దీంతో వాహనాల రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు. పోలీసులు దగ్గరుండి ఒక్కొక్క వాహనాన్ని వరద దాటించి పంపిస్తున్నారు. విజయవాడ-హైదరాబాద్‌ హైవేపై వాహనాలు వెళ్లేందుకు అనుమతించారు. ఆదివారం నుంచి హైవేపై ఎదురుచూస్తున్న వాహనదారులకు ఉపశమనం లభించింది. తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు నిన్నటి వరకు మునేరు ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై నిలిపివేసిన రాకపోకలను అధికారులు వరద తగ్గడంతో పరిస్థితిని పరిశీలించిన అధికారులు వాహనాలు వెళ్లేందుకు అనుమతించారు.

జాతీయ రహదారిపై భారీ ఎత్తున ప్రయాణికులు, వాహనదారులు వేచి చూశారు. ఎప్పుడెప్పుడు హైవేపై రాకపోకలు పునరుద్ధరిస్తారా అని ఎదురుచూశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి నుంచి బిహార్‌కు మృతదేహం తీసుకెళ్తున్న అంబులెన్స్ ఉదయం నుంచి ఐతవరం వద్ద ఆగిపోయింది. నందిగామ -మధిర రోడ్డుపై ఆదివారం నుంచి నిలిచిపోయిన రాకపోకలను ఇప్పటికే పునరుద్ధరించారు. వరద ఉద్ధృతికి నందిగామ నుంచి మధిర వెళ్లే రోడ్డు కొట్టుకుపోయింది. 

ABOUT THE AUTHOR

...view details