కొనసాగుతున్న రేషన్ బియ్యం దందా- గుంటూరు జిల్లాలో 100 టన్నులు పట్టివేత - Ration Rice Smuggling in Guntur - RATION RICE SMUGGLING IN GUNTUR
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 14, 2024, 10:35 AM IST
Ration Rice Smuggling in Guntur District : వైఎస్సార్సీపీ హయాంలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించి ఆ పార్టీ నేతలు కోట్ల రూపాయలు దండుకున్నారని కూటమి నాయకులు ఆరోపించారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చమళ్లమూడిలోని పద్మజ రైస్ మిల్లులో భారీస్థాయిలో నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ లక్షలాది రూపాయలు కమీషన్ల రూపంలో దోచుకున్నారని వారు దుయ్యబట్టారు.
వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే సుచరితకు ఈ మిల్లు నుంచి ప్రతి నెల లక్షలాది రూపాయలు కమీషన్ల రూపంలో వెళ్లాయని కూటమి నాయకులు ఆరోపించారు. ఈ క్రమంలోనే సుమారు 100 టన్నుల రేషన్ బియాన్ని సీజ్ చేసినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. అక్రమాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మిల్లు యజమాని పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు గత ఐదేళ్లుగా భారీ స్థాయిలో ఈ దందా సాగుతున్నా పౌరసరఫరాల శాఖ అధికారులు చిన్నపాటి కేసులు పెట్టి చేతులు దులుపుకొన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.