డల్లాస్‌లో రామోజీరావుకు ఎన్ఆర్ఐల నివాళి - NRIs Condolence to Media Mogul Ramoji Rao - NRIS CONDOLENCE TO MEDIA MOGUL RAMOJI RAO
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 9, 2024, 9:17 AM IST
NRIs Condolence to Media Mogul Ramoji Rao in Dallas : ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు ఆరోగ్య సమస్యలతో శనివారం ఉదయం 4.50 గంటలకు కన్నుమూశారు. ఆయన అస్తమయంతో పలువురు ఎన్నారైలు సంతాపం తెలిపారు. డల్లాస్‌లోని కాకతీయ సేవాసమితి ఆధ్వర్యములో రామోజీరావు సంస్మరణ సభను నిర్వహించి అంజలి ఘటించారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి పట్టుదలతో ఈనాడు, ఈటీవీ వంటి సంస్థలను స్థాపించి ఉపాధి కల్పించారని కొనియాడారు. రామోజీరావు మరణం తెలుగు ప్రజలకు తీర్చలేని లోటని పలువురు ఎన్నారైలు అన్నారు. ఆయన మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.
రామోజీరావు అంత్యక్రియలను నేడు (ఆదివారం) నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఉదయం 9 నుంచి 10 మధ్య అంత్యక్రియలు జరపనున్నారు. ఆదివారం, సోమవారం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.