ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అడుగంటిన కండలేరు- జలాశయంలో డెడ్‌స్టోరేజీకి చేరిన నీటినిల్వలు - No Water in Kandaleru Jalasayam - NO WATER IN KANDALERU JALASAYAM

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 21, 2024, 3:09 PM IST

No Water in Kandaleru Telugu Ganga Project: నెల్లూరు- తిరుపతి జిల్లాల పరిధిలో సాగునీరు, తాగునీటి కష్టాలు తీర్చేందుకు సోమశిల జలాశయానికి అనుసంధానంగా కండలేరు జలాశయాన్ని నిర్మించారు. 65 టీఎంసీల సామర్థ్యమున్న జలాశయం ప్రస్తుతం 6 టీఎంసీల నీటినిల్వతో డెడ్‌స్టోరేజీకి చేరుకుంది. దీంతో 2 లక్షల ఎకరాల్లో సాగు, చెన్నై, తిరుపతి, నాయుడుపేట, రాపూరు ప్రాంతాలకు తాగునీరు సరఫరా ప్రశ్నార్థకంగా మారింది. వర్షాభావ పరిస్థితులతో జలాశయంలో నీటినిల్వలు అడుగంటాయి. జలాశయం ఆయకట్టు పరిధిలో 3 లక్షల ఎకరాల సాగుకు నీరు లేదు. ప్రస్తుతం కండలేరు పరిస్థితిపై తెలుగుగంగ సూపరింటెండెంట్‌ వెంకటరమణారెడ్డితో మా ప్రతినిధి రాజారావు నిర్వహించిన ముఖాముఖిలో ఆయన తెలిపారు.

రానున్న రెండు నెలల్లో వర్షాలు కురిసే వరకు డెడ్​స్టోరేజీలో ఉన్న నీటిని కేవలం తాగునీటి కోసం మాత్రమే కేటాయించడం జరిగిందన్నారు. సెప్టెంబరు నెలలో శ్రీశైలం ప్రాజెక్టు, రాయలసీమ ప్రాజెక్టులు ద్వారా సోమశిల నిండిన తర్వాత దాని నుంచి కండలేరుకి 40 టీఎంసీలు తీసుకుంటే నవంబరులో పంటలు సాగుచేసే వారికి నీళ్లు ఇవ్వడం జరుగుతుందని వెంకటరమణారెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details