ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఆ గ్రామాల ప్రజలు ఓటెయ్యాలంటే అవే దిక్కు! - going polling station on horses - GOING POLLING STATION ON HORSES

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 29, 2024, 7:45 PM IST

No Polling Booths in Tribal Areas : అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని నేరేడుబంధ, పెదగరువు, రావిపాడు తదితర 8 గ్రామాల్లో పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. నేరేడుబంధ గ్రామం నుంచి 7 కి.మీ. దూరం గుర్రాలపై పోలింగ్ కేంద్రానికి వస్తున్నామని, కనీసం రోడ్డు సదుపాయం కూడా లేదని ఆదివాసీలు వాపోయారు. అధికార నేతలు గిరిజనులకు సదుపాయాలు కల్పించడం లేదు కాని కొండలపై క్వారీలు నిర్వహించే పెద్దలకు సౌకర్యాలుకల్పిస్తున్నారని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె.గోవిందరావు, పీవీటీజీ గిరిజన సంఘం అధ్యక్షుడు డిప్పల అప్పారావులు ధ్వజమెత్తారు. 

తాము ఓటు వెయ్యాలంటే వారికి రోడ్డు సదుపాయం, అందుబాటులో పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చెయ్యాలని ఆదివాసీలు డిమాండ్​ చేశారు. అధికారంలో ఉన్న ఐదేళ్లు ఏ రాజకీయ ప్రతినిధి మా కష్టాలు తెలుసుకుని తమకు సాయం అందించలేదు. ఇప్పుడు ఎన్నికల వేళ ఓటు కోసం హామీల ఆశ చూపి వెళ్తారు అని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details