ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

న్యాయం చేయండి - లేకపోతే ఆత్మహత్యే - వైసీపీ కార్యకర్త సెల్ఫీ వీడియో కలకలం - వైసీపీ కార్యకర్త సెల్పీ వీడియో

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 24, 2024, 3:03 PM IST

Narasaraopet MLA Gopireddy Harassing YSRCP Activist : పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తనను వేధింపులకు గురి చేస్తున్నారని వైఎస్సార్సీపీ కార్యకర్త గుణపాటి వెంకటేశ్వరరెడ్డి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే గోపిరెడ్డి నుంచి తనను కాపాడకపోతే భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. 

YSRCP Worker Gunapati Venkateswara Reddy Selfie Video : గత కొంతకాలం క్రితం నర్సింగపాడు నుండి వచ్చి నరసరావుపేటలో స్థిరపడ్డామని వెంకటేశ్వరరెడ్డి తెలిపాడు. రావిపాడు రోడ్డులో పొలం కొనుక్కుని భార్యతో పాటు జీవిస్తున్నామన్నారు. ఇటీవల ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యతిరేక వర్గాన్ని తాడేపల్లికి పిలిచి ఎమ్మెల్యే గోపిరెడ్డి వల్ల ఏమైనా సమస్యలు ఉంటే తనకు చెప్పాలని ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. నరసరావుపేటలో 2015లో 41 సెంట్లు పొలం కొనుగోలు చేశానని విజయసాయిరెడ్డికి తెలిపానని అన్నారు. ఆ పొలం తనకు ఇవ్వమని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎంతోకాలం నుంచి తనను వేధిస్తున్నారని ఎంపీకి వివరించానని పేర్కొన్నారు. రెండు దఫాలుగా సుమారుగా రూ.23 లక్షలు ఇచ్చినా వదిలిపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

దీంతో ఎమ్మెల్యే అనుచరులు అర్ధరాత్రి ఇంటికి వచ్చి దాడి చేశారని, బెదిరింపులకు పాల్పడినట్లు బాధితుడు ఆరోపించాడు. సీఎం జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డిలు కల్పించుకుని తనను ఎమ్మెల్యే నుంచి కాపాడాలని సెల్ఫీ వీడియో ద్వారా వెంకటేశ్వరరెడ్డి వేడుకున్నాడు. లేదంటే తన పొలంలోనే ఎమ్మెల్యే పేరు రాసి పురుగుల మందు తాగి తాను, తన భార్య ఆత్మహత్య చేసుకుంటామని గుణపాటి వెంకటేశ్వరరెడ్డి హెచ్చరించారు. 

ABOUT THE AUTHOR

...view details