బాబు రాకతో అప్రమత్తమైన అధికారులు- హడావుడిగా రోడ్డుపై గుంతల పూడ్చివేత - Chandrababu Election Campaign - CHANDRABABU ELECTION CAMPAIGN
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 15, 2024, 11:01 AM IST
Nara Chandrababu Election Campaign in Vizianagaram District : తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో విజయనగరం జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇవాళ రాజాంకు చంద్రబాబు రాకను దృష్టిలో పెట్టుకొని అధికారులు హడావుడిగా రహదారిపై గుంతలు పూడ్చే కార్యక్రమానికి పూనుకున్నారు. అంబేద్కర్ కూడలి వద్ద ప్రజాగళం సభ జరుగుతున్న నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే అధికారులు, గుంతలు పూడ్చే పనులను ముమ్మరం చేశారు.
రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అంబేద్కర్ జంక్షన్ నుంచి జీఎంఆర్ఐటీ వరకు, గాయత్రి కాలనీ నుంచి బొబ్బిలి జంక్షన్ వరకు రూ. 20 కోట్ల రూపాయలతో 80 అడుగుల విస్తరణ పనులను గతేడాది మంత్రి బొత్స సత్యనారాయణ భూమి పూజ చేసి ప్రారంభించారు. గుత్తేదారుడికు రూ. 6 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉండటంతో పనులు మధ్యలో నిలిపివేశారు. దీంతో అడుగుకో గుంత ఏర్పడి ప్రయాణికులకు నిత్యం నరకప్రాయంగా మారింది. చంద్రబాబు రాకతో అధికారులు హడావుడిగా రోడ్డు మరమ్మతు చేస్తుండడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.