బాపట్లలో భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర - పలు కుటుంబాలకు పరామర్శ - Bhuvaneswari Nijam Gelavali Yatra
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 30, 2024, 7:01 PM IST
Nara Bhuvaneswari in Bapatla: చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర ఈరోజు బాపట్ల జిల్లాలో కొనసాగింది. బాబు అక్రమ అరెస్ట్‌తో మనోవేదనకు గురై మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించారు. తొలుత జిల్లాలోని కొల్లూరు మండలం చిలుమూరులో పర్యటించారు. రామలింగేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Nara Bhuvaneswari Nijam Gelavali Yatra: దైవదర్శనం అనంతరం భువనేశ్వరి భట్టిప్రోలు మీదుగా చెరుకుపల్లి మండలం చేరుకుని మృతుడు వెంకటేశ్వర రావు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకుని, బాధిత కుటుంబానికి ₹3 లక్షల ఆర్థిక సహాయాన్ని భువనేశ్వరి అందజేశారు. స్థానికంగా ఉన్న మహిళలతో ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిజం గెలవాలి పర్యటనలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.