బాలకృష్ణ 'స్వర్ణాంధ్ర సాకార యాత్ర'- కదిరి నుంచి ఎన్నికల ప్రచారం షురూ - Nandamuri Balakrishna - NANDAMURI BALAKRISHNA
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 13, 2024, 2:54 PM IST
Nandamuri Balakrishna Election Campaign in Satyasai District : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రచారం జోరును పెంచారు. ' స్వర్ణాంధ్ర సాకార యాత్ర ' పేరుతో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ యాత్రను సత్యసాయి జిల్లా కదిరి నుంచి ప్రారంభించారు. ఇవాళ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కదిరికి చేరుకున్నారు. అనంతరం శ్రీ కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. నందమూరి బాలకృష్ణకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.
Balakrishna Visit to Kadiri Temple : బాలకృష్ణ శ్రీ లక్ష్మీ నరసింహస్వామితో పాటు అమృతవల్లి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి ప్రసాదాన్ని ఆయనకు అందజేశారు. శనివారం మధ్యాహ్నం స్థానిక ఎస్టీలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో పుట్టపర్తి కొత్త చెరువు ప్రధాన కూడలిలో బాలకృష్ణ రోడ్ షో నిర్వహించారు. తమ అభిమాన నటుడు, నాయకుడ్ని చూడడానికి ప్రజలు పెద్దలో అక్కడికి వచ్చారు. బాలకృష్ణతో ఫొటోలు దిగడానికి పోటీ పడ్డారు.