ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

జయహో బీసీ కార్యక్రమానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్- నాదెండ్ల మనోహర్ - Jayaho BC Sabha

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 4, 2024, 9:31 PM IST

Nadendla Manohar Interesting Comments: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం దగా చేసిందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చాక ఆమేరకు రిజర్వేషన్ కల్సిస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 5న నాగార్జున యూనిర్శిటీ ఎదుట జరగనున్న జయహో బీసీ సదస్సులో జనసేన కూడా పాల్గొంటుందని  నాదెండ్ల వెల్లడించారు. రేపు విడుదల చేయనున్న బీసీ మ్యానిఫెస్టోకు సంబంధించి జనసేన సైతం కొన్ని సూచనలు చేసినట్లు తెలిపారు. బీసీ కులాలకు చెందిన ప్రతినిధులతో భేటీ అయి వారి అభిప్రాయాల్ని సైతం తీసుకున్నట్లు పేర్కొన్నారు. జయహో బీసీ కార్యక్రమానికి చంద్రబాబుతో పాటుగా పవన్ కల్యాణ్ పాల్గొంటారని నాదెండ్ల వెల్లడించారు. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన మాట్లాడారు. చేతి వృత్తుల వారికి పెన్షన్ తో పాటు, బీసీ కులాల కార్పొరేషన్లకు సంబంధించి నిధుల కేటాంయిపుపై జనసేన, టీడీపీ ఉమ్మడి మ్యానిఫెస్టోలో చేరుస్తున్నట్లు తెలిపారు. సీఎం జగన్  కులానికి ఓ కార్పొరెషన్ ఏర్పాటుచేసి, వారికి ఎలాంటి అధికారం ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. 

ABOUT THE AUTHOR

...view details