ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మద్యం సిట్టింగ్​లో ఘర్షణ!- రాయితో దాడి చేయడంతో స్నేహితుడు మృతి - MAN MURDER IN SRIKAKULAM DISTRICT - MAN MURDER IN SRIKAKULAM DISTRICT

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 6, 2024, 1:27 PM IST

Updated : Jun 6, 2024, 1:35 PM IST

Murder In Srikakulam District : శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని కొర్లం మెయిన్ రోడ్డు వద్ద సంగీత దాబాలో పనిచేస్తున్న రాంబాబు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అదే దాబాలో పనిచేస్తున్న మహంతితో కలిసి మద్యం సేవిస్తుండగా ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఘర్షణలో మహంతి రాంబాబుపై రాయితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపరచడంతో రాంబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన పై దాబా యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

ఈ దారుణంతో స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అసలు వారివురి మధ్య వాగ్వాదానికి కారణాలేంటని విషయం ప్రశ్నాత్మకంగా మిగిలిందని అక్కడ ఉన్న వారు తెలిపారు. హత్యపై పలు అనుమానాలు వెలిబుచ్చుతున్నారు. మద్యం మత్తులో స్నేహితుడ్ని రాయితో కొట్టి చంపాడా లేక వారివురి మధ్య ఏవైనా పాత కక్షలు ఉన్నాయా అన్న వివరాలు తెలియాల్సి ఉంది.

Last Updated : Jun 6, 2024, 1:35 PM IST

ABOUT THE AUTHOR

...view details