ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మద్యం మత్తులో మున్సిపల్ కమిషనర్ వీరంగం - కాలనీవాసుల ఆందోళన - Municipal Commissioner Intoxicated - MUNICIPAL COMMISSIONER INTOXICATED

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 8, 2024, 11:38 AM IST

Municipal Commissioner Intoxicated Hulchul: అనంతపురం జిల్లా రాయదుర్గంలో మద్యం మత్తులో మున్సిపల్ కమిషనర్ కిషోర్ వీరంగం సృష్టించారు. 5 రోజులుగా తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నామని సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరిన మహిళలపై మున్సిపల్ కమిషనర్ కిషోర్ దూషణకు దిగుతూ చిందులు వేశారు. తాగునీటి విషయంలో రాజకీయం చేస్తున్నారంటూ మహిళలపై మండిపడ్డారు. రాజకీయం చేస్తున్న వారిపై కేసులు బనాయించే విధంగా చర్యలు తీసుకుంటామని మహిళలను హెచ్చరించారు.  నీటి సమస్యను ఎదుర్కొంటున్న విషయాన్ని 6వ వార్డు ప్రజలు ముందుగా ఆ వార్డు కౌన్సిలర్ మంజునాథ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన మున్సిపాలిటీ నుంచి వాటర్ ట్యాంకర్​ను పిలిపించారు. 

అయితే సామాన్య ప్రజలకు అందకుండా మున్సిపల్ ఛైర్మన్ పోరాళ్లు శిల్ప బంధువులు ఆ వార్డులో ఉండడంతో వారికి ముందుగా టాంకర్ నుంచి నీళ్లు వదిలారు. దీంతో ఆ వార్డులోని మహిళలు ఆందోళనకు దిగారు. ఇంతలోనే మున్సిపల్ కమిషనర్ కిషోర్ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. మద్యం మత్తులో ఉన్న ఆయన మహిళలపై అసభ్య పదజాలంతో దూషించటమే కాకుండా వీరంగం సృష్టించి మహిళలను భయభ్రాంతులకు గురి చేశారు. తాగునీరు అడిగితే మున్సిపల్ కమిషనర్ తమపై చిందులు వేయడం ఏంటని ఆ కాలనీలోని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి మున్సిపల్ కమిషనర్ పై వెంటనే తగు చర్యలు చేపట్టాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details