వైఎస్సార్సీపీ హయాంలో కొత్త వైద్య కళాశాలలు, ఆసుపత్రులు రాలేదు : మాగుంట - mp magunta speech in loksabha
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 26, 2024, 3:54 PM IST
|Updated : Jul 26, 2024, 4:32 PM IST
MP Magunta Srinivasulu Reddy Questions on Medical Colleges : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త వైద్య కళాశాలలు, ఆసుపత్రులు రాలేదని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి అన్నారు. ఎన్ఎమ్సీ విధానం ప్రకారం ఏపీతో పాటు దక్షిణ భారతదేశానికి ఎందుకు ఎంబీబీఎస్ సీట్లు పెంచట్లేదని లోక్‌సభలో ప్రశ్నించారు.
Lok Sabha Sessions 2024 : ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ప్రశ్నకు స్పందించిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా, దేశంలో ఇప్పుడు 23 ఎయిమ్స్ కళాశాలలు ఉన్నాయని తెలిపారు. మెడికల్ కాలేజీలు 731 ఉన్నట్లు తెలిపారు. ఎంబీబీఎస్ సీట్ల శాతం పెరిగినట్లు సమాధానం ఇచ్చారు. సభ్యుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి కోరినట్లు వైద్య కళాశాలలను విస్తరించి అనుభవజ్ఞులైన వైద్యులను నియమిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 17 మెడికల్ నిర్మిస్తామని ఆర్భాటాలే తప్ప ఆచరణలో పెట్టలేదని మాగుంట విమర్శించారు. ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాలను కేంద్ర ప్రయోజిత పథకంలో చేర్చి నిధులు ఇవ్వాలని కోరారు. ఎంపీ మాగుంట కోరినట్లు ఏపీలో ఎయిమ్స్‌ను ప్రారంభిస్తామని జేపీ నడ్డా హామీ ఇచ్చారు.