గన్నవరం ఎయిర్ పోర్ట్ సేవలు విస్తరించాలి- కేంద్ర మంత్రి రామ్మోహన్‌కు కేశినేని వినతి - Kesineni Meet Kinjarapu Rammohan - KESINENI MEET KINJARAPU RAMMOHAN
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 29, 2024, 3:52 PM IST
MP Kesineni Sivanath Letter To Union Civil Aviation Minister Kinjarapu Rammohan Naidu : గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు విమాన సర్వీసులు ప్రారంభించాల్సిందిగా ఎంపీ కేశినేని శివనాథ్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుకి వినతి పత్రం ఇచ్చారు. విజయవాడ నుంచి వారణాసి వయా వైజాగ్, విజయవాడ- కలకత్తా వయా విశాఖపట్నం, విజయవాడ- బెంగళూరు వయా హైదరాబాద్ లేదా కొచ్చి, విజయవాడ- అహ్మదాబాద్, విజయవాడ - పుణే విమాన సర్వీసుల ప్రారంభించాలని ఎంపీ అభ్యర్థించారు. ఇండిగో సంస్థ సర్వే చేసిన ఈ మార్గాల్లో విమాన సర్వీసులు తక్షణం ప్రారంభించేలా చూడాలని కోరారు. ఎంపీ అభ్యర్ధనపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రామ్మోహన్ నాయుడుకి ఎంపీ అభినందనలు తెలిపారు. కాగా రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన సంస్థ మంత్రి కావడం పట్ల ఏపీ ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయి. రాష్ట్రంలో విమానయాన సర్వీసులు విస్తరిస్తాయని ఆనందం వ్యక్తం చేశారు.