ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పోలవరంలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు - ఎమ్మెల్యేకు బదులు ఆమె - MLA Tellam Balaraju Wife

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 12, 2024, 3:28 PM IST

MLA Wife Inaugurated Development Works at Polavaram: ఏలూరు జిల్లా పోలవరం మండలంలో వివిధ అభివృద్ధి పనులకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు (MLA Tellam Balaraju) బదులు ఆయన భార్య ప్రారంభోత్సవాలు చేయటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అభివృద్ధి పనులు సోమవారం ప్రారంభిస్తారని స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ముందే ప్రకటించారు. కానీ ఎమ్మెల్యే ఆయా కార్యక్రమాలకు హాజరు కాకుండా అతని భార్య హాజరయ్యారు. 

Cheques Distributed by Polavaram Incharge: ఇటీవల పోలవరం నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతలు చేపట్టిన ఎమ్మెల్యే బాలరాజు భార్య రాజ్యలక్ష్మి చేతుల మీదుగా ఈ కార్యక్రమాలు జరిగాయి. వైఎస్​ఆర్ చేయూత నాలుగో విడత చెక్కులు పంపిణీ, మిచౌంగ్ తుఫాను కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు పరిహారం చెక్కులను రాజ్యలక్ష్మి అందజేశారు. హెల్త్ క్లినిక్ భవనం, సీసీ రోడ్లను ఆమె ప్రారంభించారు. హెల్త్ క్లినిక్ భవనం పనులు జరుగుతుండగానే హడావిడిగా ప్రారంభోత్సవం (Opening) చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details