ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మీడియా వల్లే బతికాను - గుంటూరు ఎస్పీ కార్యాలయానికి వచ్చిన రఘురామ - Mla Raghu Rama Raju Met Guntur SP - MLA RAGHU RAMA RAJU MET GUNTUR SP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 18, 2024, 9:49 PM IST

MLA Raghu Rama Raju Met Guntur SP : గతంలో సీఐడీ కస్టడీలో తనపై హత్యాయత్నం చేశారని ఉండి ఎమ్మెల్యే, మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయగా, కేసు పురోగతి వివరాలు తెలుసుకునేందుకు ఆయన గుంటూరు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్పీని కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ హయాంలో గుంటూరు సీఐడీ కార్యాలయంలో తనను చంపేందుకు కుట్రపన్నారని, మీడియా వల్లనే తాను బతికి బయటపడినట్లు తెలిపారు. పోలీస్‌ కస్టడీలో తనపై హత్యాయత్నం జరిగిందని ఇచ్చిన ఫిర్యాదు మేరకు, సీఐడీ మాజీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, అప్పటి సీఐడీ అడిషనల్‌ ఎస్పీ విజయ్‌ పాల్‌, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి మీద కేసు నమోదు చేశారని తెలిపారు. 

ఈ కేసుకు సంబంధించిన వివరాలు, పురోగతి తెలుసుకోవటానికే ఎస్పీ కార్యాలయానికి వచ్చానని వెల్లడించారు. అలాగే తన దగ్గర ఉన్న సమాచారం పోలీసు అధికారులకు ఇచ్చినట్లు వెల్లడించారు. మాజీ సీఎం జగన్ ప్రయేయం లేకుంటే ఉదయం తొమ్మిది గంటలకు ఫిర్యాదు, పది గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, గంటరన్నర వ్యవధిలో మంగళగిరి నుంచి హైదరాబాద్ వచ్చి ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్నందున కొద్దిరోజుల తరువాత అయినా డీజీ సునీల్‌ ఇతర అధికారుల్ని సస్పెండ్‌ చేస్తారని రఘురామ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details