ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మన్యం జిల్లా ఎన్టీఆర్​ అడ్వెంచర్‌ పార్క్​కు మరిన్ని హంగులు - MLA in Tourism Day Celebration - MLA IN TOURISM DAY CELEBRATION

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 27, 2024, 5:51 PM IST

MLA Nimmaka Jayakrishna in Tourism Day Celebration : మన్యం జిల్లా సీతంపేటలో ఎన్టీఆర్​ అడ్వెంచర్‌ పార్క్ ఆధునికీకరణకు కోటి 50లక్షల రూపాయలు కేటాయించినట్లు జిల్లా కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ తెలిపారు. పర్యటక దినోత్సం సందర్బంగా సీతంపేటలోని ఆడలి వ్యూ పాయింట్‌ను ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణతో కలిసి శ్యాంప్రసాద్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, ఐటీడీఏ (ITDA) పీఓ యశ్వంత్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఐటీడీఏ (INTEGRATED TRIBAL DEVELOPMENT AGENCY) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన్ ధన్ ఉత్పత్తులు, సహజ, అటవీ ఉత్పత్తుల కేంద్రం, ఆదివాసీ చిత్రలేఖనం స్టాల్స్‌ను వారు సందర్శించారు.

మరికొన్ని పర్యాటక ప్రాంతాలను అటవీ అధికారుల అనుమతి వచ్చిన వెంటనే ప్రారంభిస్తామన్నారు. ప్రతి మండలంలో ఉన్న పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల‌్యే జయకృష్ణ తెలిపారు. ప్రతి మండలంలో ఉన్న పర్యాటక ప్రదేశాలను గుర్తించి సందర్శకులకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించడానికి ప్రణాళికలు తయారు చేశామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details