ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మితిమీరిన వైసీపీ ప్రలోభాల పర్వం- 'ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా టీడీపీలోనే కొనసాగుతాం' - MLA Mekapati Ravinder - MLA MEKAPATI RAVINDER

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 9, 2024, 12:06 PM IST

MLA Mekapati Ravinder Pressure to join YCP in Nellore District : ఎన్నికలు సమీపిస్తుండటంతో వైసీపీ నాయకుల ప్రలోభాలకు హద్దు అదుపు లేకుండా పోతుంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి తమను ప్రలోభాలకు గురిచేస్తున్నారని సంగం సర్పంచ్‌ నిమ్మల రవణమ్మ ఆరోపించారు. తన భర్తతో కలిసి పొలాల్లో మేకలను మేపుతుండగా ఎమ్మెల్యే మేకపాటి అనుచరులు బలవంతంగా వైసీపీ కండువాను వేశారని అన్నారు. వైసీపీలో చేరితే డబ్బులు ఇస్తామని ఆశ చూపారని తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Atmakur Constituency in Nellore District : ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా టీడీపీలోనే కొనసాగుతామని రవణమ్మ తేల్చి చెప్పారు. వైసీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగానే ప్రలోభపెడుతున్నారని రవణమ్మ వెల్లడించింది. ఏకంగా ఎమ్మెల్యేనే అనుచరులతో కలిసి మహిళా సర్పంచ్‌ను బలవంతంగా వైసీపీలో చేర్చేందుకు యత్నించడాన్ని స్థానిక టీడీపీ నేత కర్నాటి రవీందర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటన వైసీపీ నాయకుల అరాచకాలకు నిదర్శమని వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details