ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని- ఏం చేశారంటే! - MLA Helps Road Accident Victims - MLA HELPS ROAD ACCIDENT VICTIMS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 20, 2024, 11:43 AM IST

MLA Pulivarthi Nani Helps Road Accident Victim : తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే (MLA) పులివర్తి నాని మానవత్వం చాటుకున్నారు. పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారిపై టమాటా లోడుతో వెళ్తున్న వాహనం బోల్తా పడింది. పాకాల పర్యటన ముగించుకుని తిరుపతికి వెళ్తున్న MLA పులివర్తి నాని ఆ ప్రమాదాన్ని చూసి తన వాహనాన్ని నిలిపారు. ప్రమాదంలో గాయపడిన డ్రైవర్‌ కిరణ్‌ కుమార్‌ను తన వాహనంలో ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నం చేశారు. అదే సమయానికి అంబులెన్సు రావడంతో  గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. వాహనదారులు భద్రతా ప్రమాణాలు పాటించి సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే పులివర్తి నాని వైద్యులకు తెలిపారు. ఎమ్మెల్యే స్పందించిన తీరుకు స్థానికులు సంతోషించారు. మానవతా దృక్పథంతో నాని వ్యవహరించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. మన కళ్ల ముందు ఎవరైనా ప్రమాదంలో ఉంటే వారికి సాయం చెయ్యడం మన ధర్మమని ఎమ్మెల్యే చెప్పకనే చెప్పారని జనాభిప్రాయం.

ABOUT THE AUTHOR

...view details