ఆరు నెలల్లో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పూర్తి: మంత్రి రామనారాయణరెడ్డి - Juvvaladinne Fishing Harbour - JUVVALADINNE FISHING HARBOUR
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 2, 2024, 9:10 PM IST
Ministers Review With Officials Ongoing Work at Fishing Harbour: నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను ఆరు నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఫిషింగ్ హర్బర్‌లో భారీగా అక్రమాలు, అవినీతి జరిగిందని ఆరోపించారు. త్వరలోనే అక్రమాలపై విచారణ జరిపిస్తామని చెప్పారు. ఫిషింగ్ హార్బర్‌ను మంత్రులు ఆనం, బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. ఫిషింగ్ హార్బర్లో జరుగుతున్న పనులపై అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న పనులు, బిల్లులు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. దగదర్తి విమానాశ్రయం శంకుస్థాపన స్థలాన్ని పరిశీలించారు.
2019 జనవరి 6న సీఎం చంద్రబాబు అంతర్జాతీయ విమానాశ్రయం కోసం దగదర్తి వద్ద శంకుస్థాపన చేశారు. విమానాశ్రయం పనులు నిలిచిపోవడానికి గల కారణాలను మంత్రులు తెలుసుకున్నారు. పనులు ప్రారంభించడానికి అవసరమైన చర్యలపై అధికారులతో మంత్రులు చర్చించారు. విమానాశ్రయానికి సంబంధించిన సమస్యలను జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు మంత్రులకు వివరించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి ఆనం కలెక్టర్‌ను కోరారు. మంత్రులతోపాటు కావలి ఎమ్మెల్యే కృష్ణా రెడ్డి, కలెక్టర్ తదితరులు వారి వెంట ఉన్నారు.