ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కర్నూలులో రహదారులు విస్తరిస్తాం: మంత్రి టీజీ భరత్ - TG bharath review city roads - TG BHARATH REVIEW CITY ROADS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 28, 2024, 7:28 PM IST

Minister TG Bharath Review on Kurnool City Roads : కర్నూలు నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా రహదారులను విస్తరించనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు. దీనికోసం ఆర్అండ్ బీ, టౌన్ ప్లానింగ్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. కిడ్స్ వరల్డ్ నుంచి ఉస్మానియా కాలేజ్, బుధవారపేట బ్రిడ్జి మీదుగా కలెక్టరేట్ వరకు ఉన్న రహదారిని విస్తరించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. అలాగే కర్నూలు ఓల్డ్ టౌన్ లోనూ ఇరుకైన దారులు ఉన్నాయని అందరితో మాట్లాడి రోడ్లు విస్తరించనున్నట్లు మంత్రి టీజీ భరత్ వివరించారు.

అలాగే కర్నూలు నగరంలో ఈరోజు మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, టీజీ భరత్​లు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇద్దరూ కలిసి ఓ బైక్ షో రూంను ప్రారంభించారు. అనంతరం బీసీ జనార్థన్ రెడ్డి దంపతులు ఓ రెస్టారెంట్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వీరితో పాటు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత దంపతులు సైతం రెండు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details