తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడిన పాపం జగన్‌దే: మంత్రి సత్యకుమార్ - Minister Satyakumar on Jagan - MINISTER SATYAKUMAR ON JAGAN
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 28, 2024, 4:31 PM IST
Minister Satyakumar Comments on Jagan about Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వాడిన పాపం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌దే అని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. ఈ క్రమంలో ప్రజలకు జగన్ క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి సత్యకుమార్ మాడ్లాడుతూ జగన్ సీఎంగా ఉన్నప్పుడు తన బంధువులైన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలను టీటీడీ ఛైర్మన్లుగా, తనకు అనుకూలమైన అధికారి ధర్మారెడ్డిని ఈవోగా నియమించారని అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యి విషయంలో జగన్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా వేంకటేశ్వర స్వామి భక్తులు ఆందోళనకు గురయ్యారని అన్నారు. నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతానని, బయట ఇతర మతాలను గౌరవిస్తానని చెప్పిన జగన్ డిక్లరేషన్‌లో సంతకం చేసే ధైర్యం లేక తిరుమలకు వెళ్లలేదని మంత్రి సత్యకుమార్ ఎద్దేవా చేశారు.