ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పారదర్శకత, వాస్తవాలు వంటి పదాలు మీరు వాడొద్దు సార్ - atchannaidu Counter to Botsa

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 6, 2024, 8:14 PM IST

Minister Atchannaidu Counter to Botsa: వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణపై మంత్రి అచ్చెన్నాయుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పారదర్శకత గురించి బొత్స, జగన్ మాట్లాడితే ప్రజలు నవ్విపోతారని ఎద్దేవా చేశారు. పారదర్శకతకు పాతరేసిందే వైఎస్సార్సీపీ అని మండిపడ్డారు. ప్రెస్ మీట్లు కూడా లైవ్ కాకుండా ఎడిట్ చేసి ఇవ్వాలని ఆదేశించే నాయకత్వంలో బొత్స పని చేస్తున్నారని దుయ్యబట్టారు. కాబట్టి దయచేసి పారదర్శకత, వాస్తవాలు వంటి పెద్ద పెద్ద పదాలు వాడొద్దని హితవు పలికారు. రాష్ట్రం ఇప్పుడు సురక్షితంగా ఉందనే విషయం ప్రజలకు తెలుసుననీ అచ్చెన్నాయుడు స్పష్టంచేశారు. ముఖ్యమంత్రుల సమావేశమయ్యాక అన్ని విషయాలు తెలుస్తాయని ఎక్స్‌లో అచ్చెన్న పోస్ట్ చేశారు.

కాగా విభజన సమస్యల పరిష్కారం కోసం సీఎంలు సమావేశం అయిన నేపథ్యంలో పోర్టుల్లో, టీటీడీ ఆస్తుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటాలు కోరుతున్నట్టుగా వస్తున్న వార్తలు ఏపీ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయని బొత్స ట్వీట్ చేశారు. పారదర్శకతకోసం, ప్రజలకు వాస్తవాలు తెలియడానికి ముఖ్యమంత్రుల సమావేశాన్ని ప్రత్యక్షప్రసారం చేస్తే బాగుంటుందని అన్నారు. బొత్స ట్వీట్​పై మంత్రి అచ్చెన్నాయుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

ABOUT THE AUTHOR

...view details