ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మేకపాటి రాజమోహన్‌ రెడ్డి మహిళపై వివాదస్పద వ్యాఖ్యలు - Mekapati Rajamohan Reddy Comments - MEKAPATI RAJAMOHAN REDDY COMMENTS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 19, 2024, 9:00 PM IST

Mekapati Rajamohan Reddy Comments on Municipal Chairperson: మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా అల్లంపాడులో రాజమోహన్‌ రెడ్డి తన కుమారుడు మేకపాటి విక్రమ్ రెడ్డి తరఫున ప్రచారం చేస్తూ రచ్చబండ కార్యక్రమం (Racchabanda Program) నిర్వహించారు. ఆత్మకూరు మున్సిపల్ ఛైర్పర్సన్ వెంకట రవణమ్మపై కించపరిచే వ్యాఖ్యలు చేశారు. వెంకట రమణమ్మ ఇటీవల వైఎస్సార్సీపీని వీడి టీడీపీ వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశంలో చేరారు. ఆమె కులం (Caste) పేరు కూడా ప్రస్తావిస్తూ విమర్శించడం చర్చనీయాంశమైంది.
 

Former MP Insulted Atmakur Municipal Chairperson Venkata Ravanamma:  మేకపాటి రాజమోహన్‌ రెడ్డి మహిళను కించపరిచేలా మాట్లాడటంతో పాటు మరి కొంత మంది నేతలను గురించి కూడా వ్యాఖ్యానించారని స్థానికులు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నేత మహిళను కించిపరిచేలా మాట్లాడటంతో పాటు కులం పేరుతో విమర్శలు చేయటంపై పలువురు ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details