ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మంగళగిరి ఎయిమ్స్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన మోదీ - Modi Inaugurated Mangalagiri AIIMS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 25, 2024, 9:17 PM IST

Mangalagiri AIIMS Inaugurated Virtually: మంగళగిరి ఎయిమ్స్‌ను ప్రదానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితమిచ్చారు. గుజరాత్​లోని రాజ్​కోట్​లో నుంచి వర్చువల్​గా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఒకేసారి 5 ఎయిమ్స్ ఆస్పత్రులను ప్రధాని  ప్రారంభించారు. మంగళగిరిలో జరిగిన కార్యక్రమానికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, హాజరయ్యారు.  అదే విధంగా మంత్రి విడదల రజని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సైతం కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళగిరిలో ఎయిమ్స్‌ నిర్మించటం రాష్ట్ర ప్రజల అధృష్టమని గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్ సంతోషం వ్యక్తం చేశారు.

900 పడకల సామర్థ్యంతో ఈ ఆస్పత్రిని నిర్మించగా ప్రస్తుతం 700 పడకలతో రోగులకు సేవలు అందిస్తున్నారు. మొత్తం 41 విభాగాలను ఎయిమ్స్​లో ఏర్పాటు చేశారు. మంగళగిరిలో 183 ఎకరాల విస్తీర్ణంలో ఎయిమ్స్ ఆస్పత్రి ఏర్పాటైంది. 2015 డిసెంబర్ 19న ఎయిమ్స్‌ ఆసుపత్రికి శంకుస్థాపన జరగగా, 2019 మార్చి 12 నుంచి ఓపీ సేవలు ప్రారంభం అయ్యాయి. ఎయిమ్స్‌ ఆస్పత్రిలో ఓపీ ఫీజు కేవలం రూ.10లు మాత్రమే. 

ABOUT THE AUTHOR

...view details