రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి - న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యుల ఆందోళన - Road accident in AP
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 20, 2024, 9:33 PM IST
Road accident in AP: రెండు నెలల క్రితం పెళ్లైన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు, స్నేహితులు ఐ.పోలవరం పోలీసు స్టేషన్ ఎదుట జాతీయ రహదారిపై ఆందోళన చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ. పోలవరం మండలం ఎదురులంక ఏటుగట్టుపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్, బైక్ ఢీ కొన్నాయి. బైక్ పై ప్రయాణిస్తున్న మణికంఠ ( 20 ) అనే వ్యక్తికి తీవ్ర గాయలయ్యాయి. మణికంఠ ప్రమాద ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
మణికంఠ మృతిపై కుటుంబ సభ్యులు జాతీయ రహదారిపై ఆందోళన కార్యక్రం చేపట్టారు. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని ఆరోపిస్తున్నారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేసే విధంగా చర్యలు చేపడతామని పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.