రావి ఆకుపై యోగాసనాలు - మాములుగా లేదుగా - చూస్తే వాహ్ అనాల్సిందే! - International Yoga Day 2024 - INTERNATIONAL YOGA DAY 2024
Published : Jun 21, 2024, 12:50 PM IST
Man Draw Yoga Asanas on Leaf in Jagtial : యోగా దశాబ్ధి దినోత్సవం సందర్భంగా ఓ చిత్రకారుడు రావి ఆకుపై యోగాసనాలు చిత్రీకరించాడు. ఆ ఆకు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన గాలిపెల్లి చోళేశ్వర్ అనే యువకుడు ప్రతి వేడుకలకు తనదైన శైలిలో మైక్రో ఆర్ట్స్‌ను తయారు చేస్తుంటాడు. ఎక్కువగా ఆకులపై చిత్రాలను గీస్తుంటాడు.
Yoga Asanas on Leaf Video : ఈ క్రమంలోనే నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రావి చెట్టు ఆకుపై పది ఆసనాలు సరిపోయే విధంగా అందంగా, ఆకర్షవంతంగా చోళేశ్వర్ యోగాసనాలను చిత్రీకరించాడు. చూసేందుకు కనువిందుగా అనిపిస్తోంది. ఇలాంటి చిత్రాలు తయారు చేస్తూ ప్రతి ఒక్కరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇప్పటికే ఇలాంటి ఆశ్చర్యపరిచే ఎన్నో చిత్రాలను వేసి ప్రముఖులతో ప్రశంసలు పొందాడు. ఇది తయారు చేసేందుకు సుమారు 30 నిమిషాల సమయం పట్టిందని యువకుడు తెలిపాడు.