LIVE : శాసనమండలి సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం - LEGISLATIVE COUNCIL SESSIONS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 15, 2024, 10:10 AM IST
|Updated : Nov 15, 2024, 2:00 PM IST
Legislative Council Sessions 2024 LIVE : శాసనమండలిలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటన చేస్తున్నారు. పారిశ్రామిక అభివృద్ధి, ఆహారశుద్ధి, ప్రైవేట్ పారిశ్రామిక పార్కుల స్థాపనపై మంత్రి టి.జి భరత్ ప్రకటన చేస్తారు. 2024-25 వార్షిక బడ్జెట్‌పై నేడు మండలిలో చర్చ ముగియనుంది.గురువారం శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు చంద్రబాబు ప్రస్తావన తెచ్చారు. చంద్రబాబును అవమానించారని ఈ సందర్భంగా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లిని దుర్భాషలాడారని మండిపడ్డారు. అయితే తల్లిని అవమానించడాన్ని ఎవరూ సమర్థించరని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు. వీడియోలన్నీ ఉన్నాయని లోకేశ్ తేల్చిచెప్పారు. శాసనసభ సాక్షిగా తన తల్లిని అవమానించారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోజు తన తల్లిని అవమానించింది మీకు గుర్తుకు రావట్లేదా అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలను ప్రశ్నించారు. తాము ఎప్పుడూ జగన్ కుటుంబంపై మాట్లాడలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం నేటి శాసనమండలి సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం మీకోసం.
Last Updated : Nov 15, 2024, 2:00 PM IST