ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కీలక తీర్పు - పార్టీలకతీతంగా స్వాగతించిన నేతలు - SC ST SUB CLASSIFICATION - SC ST SUB CLASSIFICATION
Published : Aug 1, 2024, 3:38 PM IST
Political Leaders on SC ST SUB CLASSIFICATION : ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును పార్టీలకతీతంగా నాయకులు స్వాగతించారు. సుప్రీం తీర్పుపై సంతోషం వ్యక్తం చేసిన వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్రంలో వర్గీకరణను అమలు చేస్తామని ప్రకటించారు. సుప్రీం కోర్టు తీర్పును అందరూ స్వాగతించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఎస్సీ వర్గీకరణకు గతంలో టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు శాసన సభలో ఏకగ్రీవ తీర్మానం చేశాయని, వర్గీకరణకు అన్ని పార్టీలు అండగా నిలిచాయని కడియం వివరించారు.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, వర్గీకరణ కోసం గతంలో ఎంతో మంది ప్రాణాలు అర్పించారని, గాంధీభవన్ వద్ద ఆత్మాహుతికి పాల్పడితే అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. వర్గీకరణపై సుప్రీం తీర్పును బీజేపీ శాసన సభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సహా పలువురు నాయకులు మనస్ఫూర్తిగా స్వాగతించారు.