ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పాతకక్షలు - అన్న కుమార్తెపై హత్యాయత్నం - తీవ్రగాయాలు - Land Disputes in Atmakur

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 15, 2024, 8:44 PM IST

Land Disputes in Atmakuru of Nellore District : నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఆస్తికోసం చెలరేగిన వివాదం చివరికి హత్యాయత్నానికి దారి తీసింది. పట్టణంలోని నాగేంద్రపురం ప్రాంతానికి చెందిన శేషగిరిరావుకు తన తమ్ముడైన వెంకటేశ్వర్లు మధ్య కొన్ని నెలల క్రితం వరకు భూవివాదం ఉండేది. పెద్దలు ఇద్దరిని రాజీ చేసేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా వారు మాత్రం పంతం వీడలేదు. ఈ కారణంగా రెండు కుటుంబాల మధ్య మనస్పర్ధలు పెరిగి చివరికి మాట్లడుకోవటం మానేశారు. 

Attempted Murder of Woman Due to Old Feuds : క్రమంగా భూసమస్యలు తొలగిపోతున్న క్రమంలో పాత కక్షలను మనసులో పెట్టుకొని వెంకటేశ్వర్లు తన అన్న కుమార్తె స్వప్నపై కొడవలితో దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. మెడ, చేతులపై  తీవ్రంగా గాయపడ్డ స్వప్నను స్థానికులు హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపడుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details