యాదాద్రిలో లక్ష పుష్పార్చన పూజ - పెరిగిన భక్తుల రద్దీ - Yadadri Laksha Pushparchana Pooja - YADADRI LAKSHA PUSHPARCHANA POOJA
Published : May 19, 2024, 2:16 PM IST
Laksha Pushparchana Pooja in Yadadri Temple : యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఏకాదశి పర్వదినాన్నిపురస్కరించుకుని లక్ష పుష్పార్చన పూజలు జరిగాయి. సుమారు గంట పాటు ప్రధాన ఆలయంలోని ముఖ మండపంలో పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం అర్చకులు వైభవంగా చేశారు. స్వామి వారిని పట్టువస్త్రాలతో దివ్యమనోహరంగా అలంకరించి ఆచార్యులు ప్రత్యేక వేదికపై తీర్చిదిద్దారు. ఆలయ అర్చకులు వేదపండితుల, వేద మంత్రోచ్ఛారణ చేత, సన్నాయి మేళం నడుమ ఆలయ సంప్రదాయం ప్రకారం ఈ ఉత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ పూజలో పాల్గొన్న భక్తులకి విశిష్టతను అర్చకులు వివరించారు.
Devotees Rush in Yadadri : లక్ష పుష్పార్చన పూజలు కార్యక్రమంలో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇవాళ ఆదివారం కూడా కావడంతో మరింత ఎక్కువ మంది వచ్చారని ఆలయ అధికారులు తెలిపారు. ఉదయం నుంచి భక్తుల రద్దీ పెరిగిందని, స్వామి వారి సర్వ దర్శనానికి సుమారు 3 గంటలు, ప్రత్యేక దర్శినానికి సుమారు 2 గంటల సమయం పడుతోందని పేర్కొన్నారు. భక్తుల ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.