LIVE : నాగర్‌కర్నూల్ ఎంపీ నియోజకవర్గ సన్నాహక భేటీలో కేటీఆర్ - ప్రత్యక్షప్రసారం - KTR in Nagarkurnool Live
Published : Feb 25, 2024, 2:16 PM IST
|Updated : Feb 25, 2024, 2:21 PM IST
KTR Live : కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే కాంగ్రెస్ నాయకులు హామీలు అమలు చేస్తామంటున్నారని మండిపడ్డారు. కరెంట్ బిల్లు సోనియాగాంధీ కట్టారా, ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ నైజమని ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతేనే వారు ఇచ్చిన హామీలు అమలు చేస్తారని తెలిపారు. బీజేపీ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్రానికి చేసిందేంటి అని ప్రశ్నించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రియమైనవారు కాదని పిరమైన ప్రధాని అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో గెలుపు కోసం కాంగ్రెస్ ఇష్టారీతిలో హామీలు ఇచ్చిందని విమర్శించారు. ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి అదానీని తిట్టారని, మోదీ మనిషి అన్నారని, కానీ ఇప్పుడు వారితో ఒప్పందాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. తాజాగా నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేటలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ఎంపీ నియోజకవర్గ సన్నాహక భేటీలో కేటీఆర్ పాల్గొన్నారు.
Last Updated : Feb 25, 2024, 2:21 PM IST