ఇఫ్తార్ విందుకు హాజరైన కేటీఆర్ - రాష్ట్రంలో హిందూ ముస్లిం సోదర భావంతో ఫరిఢవిల్లాలని ఆకాంక్ష - KTR Attends Iftar Dinner - KTR ATTENDS IFTAR DINNER
Published : Mar 30, 2024, 8:03 PM IST
KTR Attends Iftar Dinner at Banjara Hills : తెలంగాణలో హిందూ ముస్లిం సోదర భావంతో ఫరిఢవిల్లాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ ఆకాంక్షించారు. బంజారాహిల్స్‌లో ఇఫ్తార్ విందుకు హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కూడా విందులో పాల్గొన్నారు. విందులో పాల్గొన్న కేటీఆర్ ముస్లిం సోదరులకు ఫలాలు తినిపించి, వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు.
వారందరితో కాసేపు సరదాగా ముచ్చటించారు. ఇస్లాం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే రంజాన్ మాసం, వారికి శుభం కలిగించాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ రంజాన్ పండుగ అన్ని విజయాలను తీసుకురావాలని కోరారు. అనంతరం యువకులతో కలిసి కేటీఆర్ సరదాగా సెల్ఫీలు దిగారు. యువకులతో కాసేపు మాట్లాడారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్‌తో పాడి కౌశిక్ రెడ్డి కాసేపు ముచ్చటించి ఆలింగనం చేసుకున్నారు. వారు ఇస్లాం సోదరులకు కర్జూర ఫలాలు తినిపించారు. వారంతా కలిసి విందు చేశారు.