ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

గండికోటకు చేరిన కృష్ణా జలాలు- హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు - Krishna Water Reached in Gandikota - KRISHNA WATER REACHED IN GANDIKOTA

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 11, 2024, 2:17 PM IST

Krishna Water Reached in Gandikota : వైఎస్సార్‌ జిల్లాలోనే అతి పెద్ద జలాశయమైన గండికోటకు కృష్ణా జలాలు చేరాయి. నంద్యాల జిల్లా అవుకు జలాశయం నుంచి కృష్ణా జలాలను శనివారం సాయంత్రం ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం 6:40 గంటలకు నీరు గండికోటకు చేరింది. ఈ సందర్భంగా నేతలు, రైతులు, అధికారులు నీటికి పూజలు నిర్వహించారు. కొబ్బరికాయలు, పసుపుకుంకమలతో పూజలు జరిపారు.

Gandikota Reservoir Updates : జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 26.85 టీఎంసీలుగా కాగా ప్రస్తుతం 1.5 టీఎంసీల నీటిమట్టం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. రోజుకు 11,000 క్యూసెక్కుల నీరు వస్తే, 24 గంటలలోగా ఒక టీఎంసీకి చేరుతుందని పేర్కొన్నారు. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం అనుగుణంగా గండికోటలో పూర్తిస్థాయిలో 20 టీఎంసీలు ఉంచేందుకు ప్రయత్నం చేస్తామని నీటిపారుదలశాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు జలాశయంలోకి నీటిని విడుదల చేయడంతో  రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు తాగు, సాగునీటికి ఇబ్బందులు తప్పాయని వారు అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details