బాలినేనికి తీవ్ర అవమానం - ఎమ్మెల్యే వస్తున్నారని తెలిసినా రాని ప్రజలు - Balineni in kottapatnam
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 13, 2024, 7:33 PM IST
Kottapatnam People Refused Secretariat Inauguration by Balineni: రోజురోజుకు వైఎస్సార్సీపీ పాలనపై ప్రజా వ్యతిరేకత ఎక్కువ అవుతోంది. జగన్ పాలనలో అభివృద్ధి కన్నా దోపిడీకే పెద్ద పీట వేయటంతో ప్రజలు వైఎస్సార్సీపీపై ఆగ్రహంగా ఉన్నారు. దీనికి నిదర్శనంగా ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. సచివాలయ ప్రారంభోత్సవానికి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి (MLA Balineni srinivas Reddy) వస్తున్నారని తెలిసినా ప్రజలు ఎవ్వరూ రాకపోవటంతో సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్సార్సీపీ నాయకులతో సచివాలయ ప్రారంభోత్సవాన్ని మమా అనిపించారు.
కొత్తపట్నంలోని సచివాలయం నిర్మాణ పనులు పూర్తయి సంవత్సరం దాటినా ప్రభుత్వం నుంచి గుత్తేదార్లకు సకాలంతో బిల్లులు అందలేదు. దీంతో సచివాలయం తాళాలు ఇస్తే అధికారుల నుంచి డబ్బులు వస్తాయో రావో అని గుత్తేదారులు సచివాలయ తాళాలు అప్పగించలేదు. రెండు నెలల క్రితం ప్రభుత్వం గుత్తేదారులకు పెండింగ్ బిల్లులు చెల్లించటంతో సచివాలయ తాళాలు ఇచ్చారు. అధికారులు సచివాలయాన్ని అప్పుడే ప్రారంభించకుండా ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల సమీపిస్తుండటంతో హడావుడిగా సచివాలయాన్ని ప్రారంభం చేయటంపై విమర్శలకు దారి తీస్తోంది.