ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

హైకోర్టుకు ఇద్దరు అదనపు న్యాయమూర్తులు- ప్రమాణ స్వీకారం చేయించిన సీజే - High Court Judges Oath taking

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 14, 2024, 3:51 PM IST

High Court Judges Oath taking : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం (AP High Court) లో అదనపు న్యాయమూర్తులుగా పని చేస్తూ న్యాయమూర్తులుగా నియమితులైన జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనర్సింహ చక్రవర్తి, జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జున రావు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆ ఇరువురిని  న్యాయమూర్తులుగా ప్రమాణం చేయించారు. 

ఈ మేరకు గురువారం రాష్ట్ర హైకోర్టు లోని మొదటి కోర్టు హాల్లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఇరువురు నూతన న్యాయమూర్తులచే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, ఏపీ హైకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ఘంటా రామారావు, ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జానకి రామిరెడ్డి, రిజిష్ట్రార్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details