ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

విశాఖలో చెవిరెడ్డి వేయి కోట్ల వ్యాపారం చేశాడు- మూర్తియాదవ్ - Murthy Yadav Fires on Bhaskar Reddy - MURTHY YADAV FIRES ON BHASKAR REDDY

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 16, 2024, 8:14 PM IST

JSP Leader Murthy Yadav Comments on Chevireddy Bhaskar Reddy: చంద్రగరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనకు ఏమాత్రం సంబంధం లేని విశాఖకు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా పంగనామాలు పెట్టారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా రుషికొండలో విధ్వంసం చేయించి లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వి అమ్ముకున్నారని ఆరోపించారు. పెందుర్తి నియోజకవర్గం గుర్రంపాలెంలో పరిశ్రమలకు కేటాయించిన 200 ఎకరాల్లో మైనింగ్ చేసి సొమ్ము చేసుకున్నారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా విశాఖ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు కేవలం చెవిరెడ్డికి లబ్ధి చేకూర్చేందుకు టీడీఆర్ బాండ్లు మంజూరు చేశారన్నారు. 

తిరుపతి జిల్లా చంద్రగిరి శాసనసభ్యుడిగా ఉన్న చెవిరెడ్డి విశాఖకు వచ్చి ఐదు సంవత్సరాలలో 1000 కోట్లకుపైగా వ్యాపారం చేశారంటే జగన్ పాలనలో ఎంతగా దోపిడీ సాగిందో తెలుస్తుందని మూర్తి యాదవ్​ విమర్శలు గుప్పించారు. జగన్ దోపిడి బృందం ఆస్తులను దోచుకుని ప్రకృతి వనరులను ధ్వంసం చేసిందని మండిపడ్డారు. వీటన్నింటిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. స్ట్రాంగ్ రూమ్​ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని మూర్తి యాదవ్ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details