ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మరో ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన జనసేన- పాలకొండ నుంచి ఎన్నికల బరిలో నిమ్మక - Janasena palakonda Candidate - JANASENA PALAKONDA CANDIDATE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 10, 2024, 10:54 AM IST

Janasena Announced Another MLA Candidate: సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ మిగిలిన ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించేసింది. పార్వతీపురం జిల్లా పాలకొండ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణను ఎంపిక చేస్తూ ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీయే కూటమి పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. ఎస్టీ రిజర్వ్‌డ్‌ స్థానమైన పాలకొండ నుంచి బరిలో దిగేందుకు ఆశావహులెందరో పోటీ పడ్డారు. 

దీంతో పలు సర్వేలు నిర్వహించి ఎక్కువ మంది మద్దతు లభించిన జయకృష్ణ పేరును ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పాలకొండ అభ్యర్థి ఎంపికతో జనసేన పోటీచేసే మొత్తం 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లైంది. ఇదిలా ఉండగా నేటి నుంచి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. ఇరు పార్టీల అధినేతలు కలసి ఉమ్మడిగా రోడ్ షోలు, ప్రజాగళం సభల్లో పాల్గొననున్నారు. 

ABOUT THE AUTHOR

...view details