మా ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై దృష్టి సారించింది : లోకేశ్ - LOKESH SPEECH IN USISPF
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 14, 2024, 10:45 PM IST
Minister Nara Lokesh Speech in USISPF : మిగిలిన రాష్ట్రాలన్నీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే తాము మాత్రం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై దృష్టి సారించామని మంత్రి లోకేశ్ తెలిపారు. ఇప్పటివరకు ఎవరూ చేయని నైపుణ్య గణని తాము మొదలు పెట్టామని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతుందని పేర్కొన్నారు. దిల్లీలో నిర్వహించిన ఇండియా, అమెరికా సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.
ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి కాదని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతోందని లోకేశ్ వివరించారు. మిగిలిన రాష్ట్రాలు బిజినెస్‌ని ఈజ్ చేస్తాయని చెప్పారు. కానీ స్పీడ్ చేయడం సవాల్ లాంటిందన్నారు. బిజినెస్ ప్లాన్ నెల, రెండు నెలలు ఆలస్యమయితే పెట్టుబడులు వెళ్లిపోతాయని తెలిపారు. అందుకే తాము స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేయాలనుకుంటున్నామని లోకేశ్ పేర్కొన్నారు.
Nara Lokesh Delhi Tour : నైపుణ్య గణన చేయడమనేది గొప్ప ప్రయత్నమని లోకేశ్ వివరించారు. తాను గెలిచిన అసెంబ్లీ స్థానం నుంచి దానిని పైలెట్ ప్రాజెక్టులా ప్రారంభించామని చెప్పారు. ఇంటింటికీ వెళ్లి డేటా సేకరిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్హత, నైపుణ్యాలు తెలుసుకుని మార్కెట్ డిమాండ్‌ని బట్టి వాళ్లకి ఏం నేర్పించాలో చూస్తామని లోకేశ్ వెల్లడించారు.