ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వడ్డీ వ్యాపారి ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు- రూ. 25 కోట్ల నగదు, దస్త్రాలు స్వాధీనం - IT Authorities Rides in Mangalagiri - IT AUTHORITIES RIDES IN MANGALAGIRI

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 10, 2024, 5:54 PM IST

IT Authorities Rides Textile Businessman House in Mangalagiri: పోలింగ్ దగ్గర పడుతున్న వేళ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆదాయపన్ను శాఖ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. నగరానికి చెందిన ప్రముఖ వస్త్ర, వడ్డీ వ్యాపారి నివాసంలో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ దాడిలో సుమారు 25 కోట్ల రూపాయల నగదు, ఇతర విలువైన దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల వేళ ఒకే ఇంట్లో ఇన్ని కోట్ల రూపాయలు ఉండటంపై అనుమానం వ్యక్తమవుతోంది. 

Seized the 25 Crore Cash AND Documents: అధికారులు పక్కా సమాచారంతోనే దాడులు నిర్వహించినట్లు తెలిపారు. పట్టుబడిన నగదు అధికార పార్టీకి చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. పోలింగ్​కు ఇంకా మూడు రోజులే ఉండటంతో ఓటర్లను రాజకీయ నేతలు ప్రలోభాలకు గురిచేస్తారని అధికారులు ముందుగానే ఎక్కడికక్కడ సోదాలు చేస్తున్నారు. దాడుల్లో పట్టుబడిన నగదుపై ఎలాంటి సరైన ఆధారాలు లేకపోయిన ఆ సొమ్ము మొత్తాన్ని సీజ్​ చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ నేత లోకేశ్​ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details