ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

శ్రీశైలం నీటి విడుదలకు గ్రీన్​ సిగ్నల్​- 4.5 టీఎంసీలు కేటాయించిన కేఆర్​ఎంబీ - KRMB meet - KRMB MEET

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 16, 2024, 12:23 PM IST

Irrigation Officials meeting on drinking water issue With KRMB : ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తాగునీటి సమస్యపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుతో రాష్ట్ర జలవనరుల శాఖ (KRMB) అధికారులు భేటీ అయ్యారు. తక్షణ తాగునీటి అవసరాల కోసం 5 టీఎంసీలు (TMC) విడుదల చేయాలని అధికారులు కోరారు. 4.5 టీఎంసీల నీటి విడుదలకు కేఆర్​ఎంబీ అంగీకరించింది.

శ్రీశైలం నీరు సాగర్ చేరిన వెంటనే కుడి కాలువ ద్వారా నీటిని వదులుతామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని జలవనరులు, రెవెన్యూ అధికారులకు మంత్రి ఆదేశించారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి ఎద్దడి సమస్యను సీఎం దృష్టికి మంత్రి నారాయణ, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మార్కాపురం ఎమ్మెల్యే నారాయణరెడ్డి తదితరులు తీసుకెళ్లారు. సమస్య తెలిసిన వెంటనే సీఎం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సమస్య సత్వరం పరిష్కారించేలా చూడాలని మంత్రి నిమ్మలకు బాధ్యతను అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details