ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఉరవకొండలో చిత్రవిచిత్రంగా ఓటర్ల జాబితా - ఒకే ఇంటి నంబరుపై అనేక ఓట్లు - Fake votes in AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 23, 2024, 6:41 PM IST

Irregularities in Voter List at Anantapur District: అనంతపురం జిల్లా ఉరవకొండ, విడపనకల్లు మండలాల్లో ఓటరు జాబితాలో అవకతవకలు ఉన్నాయని టీడీపీ నేతలు ఆరోపించారు. ఉరవకొండ మండలంలోని పోలింగ్​ కేంద్రం 153లో 991 మంది ఓటర్లు ఉండగా కొంత మంది ఓటర్ల పేర్లను ఒకే ఇంటి నంబరుపై నమోదు చేసినట్లు తెలిపారు. అంతే కాకుండా ఓటరు జాబితాలో 40 మందికి పైగానే మృతుల పేర్లు అలానే కొనసాగుతున్నాయని అన్నారు. 

జిల్లాలోని విడపనకల్లు పొలికి గ్రామంలో 12, 13 పోలింగు కేంద్రాలు ఉన్నాయి. ఈ రెండింటిలో కలిపి మొత్తం 2190 మంది ఓటర్లు ఉన్నారు. ఈ రెండు పోలింగు కేంద్రాల్లో 40 మందికి పైగా మృతుల పేరుతో ఓట్లు ఉన్నాయి. ఇంటింటా ఓటరు జాబితా పరిశీలనలో వాటిని తొలగించాలని టీడీపీ నేతలు బీఎల్వో అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. మృతుల వివరాలను స్థానిక ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లినా వారిని అలాగే జాబితాలో ఓటర్లుగా కొనసాగిస్తున్నారని బీఎల్​ఏ హనుమంతురెడ్డి చెప్పారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు టీడీపీ నేతలు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details