డీఎస్పీ చైతన్య అరాచకాలతో బాధితుల గగ్గోలు - చంద్రబాబే న్యాయం చేయాలని వినతి - Former DSP Chaitanya Anarchies
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 11, 2024, 10:26 PM IST
Interview With Victims of Tadipatri Police: తాడిపత్రి పూర్వ డీఎస్పీ చైతన్య అరాచకాలతో తీవ్ర ఇబ్బందులు పడిన బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తాడిపత్రిలో అధికార పార్టీ నేతలకు అంటకాగుతూ టీడీపీ కార్యకర్తలను, సానుభూతిపరులను చిత్రహింసకు గురి చేశారని డీఎస్పీ చైతన్యపై తీవ్రంగా ఆరోపణలు వచ్చాయి. చిన్నపాటి ఘర్షణ పడిన సంఘటనల్లో కూడా బాధితులకు న్యాయం చేయాల్సిన డీఎస్పీ చైతన్య రక్తమోడేలా కొట్టారని ఆరోపించారు. అక్రమ కేసులతో బాధపడుతున్న వారంతా చంద్రబాబు సీఎం అవుతుండటంతో తమకు న్యాయం చేయాలని మొరపెట్టుకుంటున్నారు.
పోలీసు స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితులనే చితకబాదిన సంఘటనలు తాడిపత్రిలో చాలా చోటుచేసుకున్నాయి. అప్పట్లో జిల్లా ఎస్పీలు కూడా తాడిపత్రిలో జరుగుతున్న పోలీసుల అరాచకాలపై అక్కడి అధికారులను మందలించకపోని తీరుతో అనేక మంది బాధితులు ఆవేదన అరణ్యరోధనగా మిగిలిపోయింది. వైఎస్సార్సీపీ నేతలతో అంటకాగిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పోలీసుల బాధితులతో మా ప్రతినిధి ముఖాముఖి నిర్వహించారు.