ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఫైళ్ల దహనం ఘటనపై ఫోరెన్సిక్‌ నివేదిక రాగానే చర్యలు: సిసోదియా - Interview with RP Sisodia - INTERVIEW WITH RP SISODIA

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 25, 2024, 9:56 PM IST

Interview with Revenue Department Principal Secretary RP Sisodia: మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను పూర్తిస్థాయిలో పరిశీలించి తగిన న్యాయం చేస్తామని రెవిన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆర్పీ సిసోదియా తిలెపారు. వ్యవస్థలో ఎక్కడో లోపాల వల్లే ప్రజలు పెద్ద సంఖ్యలో అర్జీలు సమర్పించారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వీటన్నింటిని సరిదిద్దేందుకు ప్రతివారం సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి నివేదిక అడుగుతానని సిసోదియా తెలిపారు. భూ అక్రమాలపై అర్జీలు స్వీకరిస్తాం అంటే పదిమంది వస్తారనుకున్నానని కాని వందలమంది ఫిర్యాదు చేసేందుకు రావడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. అర్జీలపై విచారణ చేసి భూ కబ్జాదారులపై చర్యలు తీసుకుంటాం సిసోదియా తెలిపారు. భారీగా అర్జీలు వచ్చాయంటే వ్యవస్థలో లోపాలు ఉన్నట్లు తెలుస్తుందని తెలిపారు. రెవెన్యూ వ్యవస్థలోని లోపాలను సరిచేసి దహనమైన దస్త్రాలను రీ క్రియేట్‌ చేస్తామని తెలిపారు. అర్జీలపై సమగ్రమైన విచారణ చేయాలని భావిస్తున్నామని దస్త్రాల దహనం ఘటనపై ఫోరెన్సిక్‌ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ భూములు ఆక్రమణ కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని సిసోదియా హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details