ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'వైఎస్సార్సీపీ నేతలు నకిలీ పట్టాలు సృష్టించి పరిహారం కొట్టేశారు'- పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత రైతులు - Interview With Polavaram Farmers

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 20, 2024, 5:49 PM IST

Interview With Polavaram Displaced Farmers in Dowleswaram : ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్ట్ కార్యాలయంలో దస్త్రాల కాల్చివేతతో ప్రాజెక్టు నిర్వాసిత రైతులు ఆందోళన చెందుతున్నారు. దేవీపట్నం మండలం గుబ్బలంపాలె, చిన్నరమణయ్య పేట గ్రామాల నుంచి నిర్వాసితులు ధవళేశ్వరం కార్యాలయానికి వచ్చి తమ దస్త్రాల గురించి ఆరా తీశారు. వైఎస్సార్సీపీ పాలనలో తమ భూములకు నకిలీ పట్టాలు సృష్టించి పరిహారం డబ్బులు కాజేశారని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా న్యాయం జరగలేదని రైతులు చెప్పారు. ఈ విషయాన్ని అధికారులకు చెబితే వినతి పత్రం సమర్పించాలని, దర్యాప్తు చేసి న్యాయం చేస్తామన్నట్లు రైతులు వివరించారు. 

ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని నిర్వాసిత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. దస్త్రాల కాల్చివేతతో ధవళేశ్వరం కార్యాలయానికి వెళ్లగా ఫైళ్లు జాగ్రత్తగానే ఉన్నాయని అధికారులు చెప్పినట్లు బాధితులు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పరిహారం ఇంకా అందలేదన్నారు. కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా న్యాయం జరగలేదని చెబుతున్న నిర్వాసిత రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. 

ABOUT THE AUTHOR

...view details