ఐదేళ్లుగా చీకటి పాలనలో ఇబ్బందులు- కూటమి గెలుపుతో కొత్త వెలుగులు: అమరావతి రైతులు - AMARAVATHI FARMERS INTERVIEW - AMARAVATHI FARMERS INTERVIEW
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 11, 2024, 3:49 PM IST
Interview With Amaravathi Farmers: రాష్ట్ర రాజధానిగా అమరావతికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని ఇక నిర్మాణమే మిగిలిందని రైతులు అంటున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నట్లు చెప్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే రాజధానిలో పనులు మళ్లీ ప్రారంభం కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లుగా జగన్ చీకటి పాలనతో ఇబ్బందులు పడ్డ తమ జీవితాల్లో కొత్త వెలుగులు వచ్చాయని రైతులు చెబుతున్నారు. 1630 రోజుల నుంచి శిబిరాల్లో మానసికక్షోభ అనుభవించిన రైతులు ప్రస్తుతం కూటమి గెలుపుతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని రాజధాని మహిళలు తెలిపారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు చెప్పుకోలేనివని రైతులు అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో పోలీసులు సైతం మమ్మల్ని అనేక ఇబ్బందులకు గురిచేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి గెలవడంతోనే అమరావతి నిలిచిందని మహిళలు, రైతులు అన్నారు. చంద్రబాబు గెలవడంతో అమరావతిలో పనులు పరుగులు పెడుతున్నాయని ఆయన కచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారంటున్న రైతులతో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి నిర్వహించారు.